పరకాలలో బస్సు కింద వృద్ధురాలు మృతి

హనుమకొండ జిల్లా పరకాల బస్టాండు ప్రాంగణంలో సోమవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బస్సు లోపలికి వచ్చే సమయంలో ప్రమాదవశాత్తు బస్సు టైర్ కింద పడి ఒక వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్