కుటుంబ కలహాలు.. మద్యం మత్తులో చెరువులో పడి మృతి

గీసుగొండ మండలం మచ్చాపురం గ్రామానికి చెందిన మొగుసాని లక్ష్మణ్ (37) మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ బాధ్యతారహితంగా ప్రవర్తించేవాడు. గత నాలుగు రోజులుగా ఇంట్లో కలహాలు జరుగుతుండగా, అతని తండ్రి, భార్య అతన్ని మందలించారు. ఈ నేపథ్యంలో మద్యం మత్తులో ఉన్న లక్ష్మణ్ గంగదేవిపల్లి చెరువులో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ విష్వేశ్వర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్