గీసుగొండ మండలం వంచనగిరి గ్రామంలో తెలంగాణ రైతు సంఘం గ్రామ కమిటీ సమావేశం బెంబిరి రామారావు అధ్యక్షతన జరిగింది. మార్చి 31న వరంగల్ రైతు భవనంలో జరిగే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పూర్తిస్థాయిలో విక్రయించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.