కోర్టు విచారణకు ఎగనామం పెట్టిన ఐదుగురు అరెస్ట్

కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న ఐదుగురు నిందితులను గీసుకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సింగిరెడ్డి బిక్షపతి, సింగిరెడ్డి రమేశ్, కుసం రాజారం, బనోతు ఎర్యా, బొంతా శివకుమార్ అనే వీరు కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ప్రత్యేక గాలింపు చేపట్టి పట్టుకున్న నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్