మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శ, కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా

వరంగల్ జిల్లా, సంగెం మండలంలోని పటాన్ తండ, కొత్తగూడెం, సోమ్లతండ, కాట్రపల్లి గ్రామాలలో ఇటీవల మృతిచెందిన గుగులోతు హరిలాల్, వాసం వీరలక్ష్మి, మన్జ్య నాయక్, పోషాల చంద్రశేఖర్ కుటుంబాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ నాయకులు, మాజీ సొసైటీ చైర్మన్ సపావత్ కిషన్, రంగరాజు శ్యామ్ సుందర్ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా కలిశారు.

సంబంధిత పోస్ట్