వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గుట్టపై స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. చుట్టూ పచ్చని పొలాలతో గుట్టపై ఈ దేవాలయం ఉంది. ఉమ్మడి జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఈ ఆలయంలో ప్రతియేటా హోలీ సందర్భంగా జాతర జరుగుతుంది. ఆదివారం తొలిఏకాదశి సందర్భంగా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.