ప్రభ బండి" ని ప్రారంభించిన హన్మకొండ డిసిసి అధ్యక్షులు

గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, ఆత్మకూరు మండలం అక్కెంపేట గ్రామానికి చెందిన సర్పంచి ముద్దం సాంబయ్య రూపొందించిన 'ప్రభ బండి'ని హన్మకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రారంభించారు. కొమ్మాల జాతరలో ప్రభ బండ్ల ఊరేగింపు ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్