సబ్‌జైల్ లో జువైనల్ బోర్డు సభ్యుల తనిఖీ

పరకాల సబ్‌ జైలును జువైనల్ జస్టిస్ బోర్డు సభ్యులు మేరుగు సుభాష్, డి. పి. ఓ. రమణమూర్తి మంగళవారం సందర్శించారు. జైలు పరిసరాలు, రిజిస్టర్లు, బ్యారక్‌లను పరిశీలించారు. 18 ఏళ్లలోపు బాలలను సబ్‌జైల్లో ఉంచకూడదని, అలాంటి వారు ఉంటే వెంటనే జువైనల్ హోంకు తరలించాలని సూచించారు. నిరుపేద ఖైదీలకు లీగల్ ఎయిడ్ ద్వారా న్యాయ సహాయం అందేలా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕