ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ఆదివారం టీచర్ అచ్చే మురళి పదవీ విరమణ అభినందన సభలో ఎంపీ పాల్గొన్నారు. భూమి ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ను సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్ గ్రేడ్ చేయాలని కోరుతున్నానని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలు సరిగ్గా చదువుకోకపోతే సమసమాజం సాధ్యం కాదని అన్నారు.