కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

కొమ్మాల జాతరలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గం తన అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె సుస్మిత పటేల్ పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. సుస్మిత తనకంటే ధైర్యవంతురాలని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎంతటివారినైనా ఎదుర్కొంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అనుచరులు ఇచ్చిన కత్తిని పట్టుకుని జాతరలో ఆయన హంగామా చేశారు. తనను ఆదరించినట్లే 'చిట్టక్క'ను కూడా దీవించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్