వరంగల్: మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు

ఇతర మంత్రుల లాగా ఫైల్ క్లియర్ చేసేందుకు తాను డబ్బులు తీసుకోనని మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం వరంగల్ కృష్ణ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అరవిందో ఫార్మా ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తనకు ఇతర మంత్రుల లాగా కమిషన్ అవసరం లేదని తనకు ఇచ్చే డబ్బులతో భవనం నిర్మించాలని సూచించానని, ప్రభుత్వం తరఫున నిర్మిస్తే క్వాలిటీతో, పాటు నిర్మాణం ఆలస్యం అవుతుందన్నారు.

సంబంధిత పోస్ట్