పరకాల వ్యవసాయ మార్కెట్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ, ఎటువంటి కట్టింగ్ లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించిన మాయిశ్చర్ ఉండాలని తెలిపారు.