సంగెం మండలం ఎల్గూరు రంగంపేట గ్రామం శివారులో సర్వే నంబర్ 648 లో 20 ఎకరాల స్థలంలో ఎం ఎస్ ఎం ఈ, 10 ఎకరాలలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణంనకు జిల్లా కలెక్టర్ సత్య శారద, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడటంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు.