పరకాలలో కాంగ్రెస్ గెలుపునకు పద్మశాలీయుల సహకారం కోరిన ఎమ్మెల్యే

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదివారం పద్మశాలి భవన్‌లో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించడంలో పద్మశాలి కులస్తుల పాత్రను కొనియాడుతూ, గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలిచిన వారిని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అదేవిధంగా సహకరించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. పరకాలలో 22 వార్డులను కాంగ్రెస్ కైవసం చేసుకుని జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. మంచినీటి వ్యవస్థ, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుతో పాటు, పరకాలను విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, టాస్క్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్