హనుమకొండ జిల్లాలో మూడో విడతలో నాలుగు మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లోని క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, సర్పంచ్, వార్డు స్థానాలకు అభ్యర్థుల నుండి నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.