వరంగల్ లో రైలు నుంచి జారిపడి ఒకరి మృతి

వరంగల్- చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య వంచనగిరి రైల్వేగేట్ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని ఒకరు మృతి చెందినట్లు వరంగల్ జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతుడు 30-35 ఏళ్ల వయసు, 5. 5 అడుగుల ఎత్తు ఉండి, నలుపు రంగు జీన్స్ ప్యాంటు, ముదురు బూడిద రంగు పుల్షర్టు ధరించి ఉన్నట్లు వెల్లడించారు. వివరాలు తెలిసినవారు 97017 47014, 87126 58585 నంబర్లను సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్