మల్లక్కపేటలో ఘనంగా జగ్జీవన్ రామ్ వర్ధంతి

జగ్జీవన్ రామ్ వర్ధంతిని హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మల్లక్కపేట గ్రామంలో జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు చందర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త అని అన్నారు. బిహార్ లో వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన రాజకీయవేత్త అని ఆయన అభివర్ణించారు.

సంబంధిత పోస్ట్