పరకాల పట్టణ ఆర్టీసీ బస్టాండ్ నందు నాలుగు నూతన ఆర్టీసీ బస్సులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వయానా బస్సు నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి సారిగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని, 2023 డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకం అమల్లోకి రాగా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని శుక్రవారం అన్నారు.