గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. అకాల వర్షాలకు టెక్స్టైల్ పార్కులో కోతకు గురైన రోడ్లను ఆయన పరిశీలించారు. రోడ్లపై రైతులు ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసిపోవడంతో నష్టపోయిన రైతులను ఎమ్మెల్యే పరామర్శించారు. పంట నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు.