సత్యసాయి రథం పరకాలకు చేరిక: భక్తుల కోలాహలం

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆదివారం పుట్టపర్తి నుండి సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సత్యసాయి రథం చేరుకుంది. కన్వీనర్ పిల్లల లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు కోలాటాలు, భాజా భజంత్రీలతో స్వామివారిని ఊరేగించారు. స్థానిక బస్ డిపో నుండి ప్రారంభమైన రథోత్సవం పురవీధుల గుండా సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, జయంతి లాల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్