సావిత్రిబాయి జయంతి: బాలికల విద్యకు ఆమె చేసిన కృషి అజరామరం

పరకాల పట్టణంలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ మాట్లాడుతూ, సావిత్రిబాయి బాలికల విద్య కోసం, కుల, మత భేదాలు లేకుండా అందరికీ విద్యను అందించడానికి కృషి చేశారని కొనియాడారు. ఆమెను 'భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు'గా గౌరవిస్తారని, ఆమె భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి బాలికల కోసం పాఠశాలలు స్థాపించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్