గీసుగొండ పోలీసులు చంద్రయ్యపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాపై చర్యలు తీసుకున్నారు. ఒక జేసీబీ, ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమి నుండి మట్టి తవ్వకాలు జరుపుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.