గీసుగొండ మండలం ఊకల్ హవేలీ గ్రామంలోని శ్రీ వల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో హోలీ పౌర్ణిమ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శన చార్యులు స్వామివారికి వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా సప్తవర్ణ అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో చేసిన ఈ అభిషేకం ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపేసింది.