వరంగల్ జిల్లా సంగెం మండలం మచ్ఛాపూర్ గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి తన అత్త ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఈ ఘటనలో మామ రవి, అల్లుడు బానోత్ వినోద్ కుమార్ ను రాయితో కొట్టి గాయపరిచాడు. అడ్డుపడిన అత్త చేతిని కూడా కొరికాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.