ఈనెల 5న ఈత కోసం కెనాల్లోకి వెళ్లి వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఫైనలియర్ విద్యార్థి భూక్య వాసు గల్లంతయ్యాడు. ఎన్టీఆర్ ఎఫ్ బృందం గాలింపు చర్యలు చేపట్టి, మొగిలిచర్ల ప్రాంతంలో కెనాల్లో మృతదేహాన్ని గుర్తించింది. వాసు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.