అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

వరంగల్ జిల్లా గీసుగొండకు చెందిన కౌలు రైతు చాపర్తి రమేష్ (45) అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 20 గుంటల భూమితో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రమేష్, పంటలు పండక అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పొలంలో గడ్డి మందు తాగి స్పృహతప్పిన అతన్ని కుటుంబ సభ్యులు వరంగల్ MGM ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్