గీసుగొండ మండలం కొనయమాకులలో గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15, 16, 17వ డివిజన్ల మహిళా సమైక్య గ్రూపు సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ జరిగింది. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలువాలన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, వారి ఆర్థికాభివృద్ధికి, ఉన్నతికి పెద్దపీట వేస్తుందని తెలిపారు.