హనుమకొండ జిల్లా ఇంటర్మీడియట్ విద్య శాఖ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని SFI జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేని ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలకు ఆ అధికారి సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన శ్రీకాంత్, ఒక్క బ్రాంచ్‌కు అనుమతితో 8-9 బ్రాంచ్‌లు నడుపుతున్నారని, ఈ కళాశాలల్లో ఫైర్ సేఫ్టీ, సరైన భవనాలు లేవని తెలిపారు.