మొగుళ్ళపల్లి మండల పరిధిలోని మూడు గ్రామాలలో దొంగలు వేర్వేరుగా చోరలకు పాల్పడ్డారు. పర్లపల్లి గ్రామంలో దొమ్మటి వెంకటేష్ కు చెందిన రూ. 1.60 లక్షల విలువైన పల్సర్ బైక్ ను దొంగలించారు. మరో గ్రామంలో 15 వేల రూపాయల నగదును అపహరించారు. ఇంకో గ్రామంలో రైతులకు చెందిన కరెంటు వైర్లను దొంగలించారు. బోనగిరి శశిరేఖ ఇంట్లో దొంగతనం చేసే ప్రయత్నంలో విఫలమయ్యారు. ఈ వరుస సంఘటనలతో మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.