వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు సమీపంలోని వాగులో శుక్రవారం యువకుడు బిల్లా సునీల్ (39) ఈతకు వెళ్లి మృతి చెందాడు. గీసుకొండ మండలం మచ్చాపూర్కు చెందిన అతను స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చి, మద్యం సేవించి విందు చేసుకున్న తర్వాత ఈత కొట్టేందుకు వాగులోకి దిగారు. లోతైన ప్రాంతంలో మునిగిపోతుండగా స్నేహితులు శివ అనే స్నేహితుడిని కాపాడగా, సునీల్ గల్లంతయ్యాడు. పోలీసులు గాలించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు అవివాహితుడు.