స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ నాయకులు, ఆశవహులు, ఇంచార్జ్ లతో జరిగిన సమావేశంలో మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అపార రాజకీయ అనుభవం కలిగిన కడియం శ్రీహరి గారి దిశ నిర్దేశంలో 100% గెలుస్తుందనే నమ్మకం ఉందని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.