వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోగ్య, పర్యావరణ ప్రమాదాలకు కారణమవుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)పై తక్షణమే పూర్తి నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో డిమాండ్ చేశారు. పార్లమెంట్ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ హర్బిసైడ్ వినియోగం వల్ల నేల, నీరు, ఇసుక తీవ్రంగా కాలుష్యం అవుతున్నాయని, దీని ప్రభావం వ్యవసాయ వ్యవస్థలపై తీవ్రమవుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.