వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి

స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు శివారులో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. తెల్లవారుజామున చీకటిలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు మృతి చెందిన ఎలుగుబంటిని పోస్ట్ మార్టం చేసి సమాధి చేశారు.

సంబంధిత పోస్ట్