మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత గుండె విజయ రామారావు ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.