జనగామ: ఇందిరమ్మ ఇండ్లకు లంచాలు వసూలు చేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో సంక్షేమ పథకాలు అందాలంటే లంచాలు చెల్లించక తప్పడం లేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. శుక్రవారం రఘునాథపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో రాజయ్య మాట్లాడారు. ఘనపూర్ కాంగ్రెస్ లో కడియం అనుచరులే తప్ప అసలైన కాంగ్రెస్ నాయకులు లేరని ఎద్దేవా చేశారు. కడియం పెద్ద అవినీతి పరుడని ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తే కడియంను చిత్తుగా ఓడించాలన్నారు.

సంబంధిత పోస్ట్