ధాన్యం కొనుగోలు ఆలస్యం పై బీఆర్ఎస్ ఆగ్రహం

చిలుపూర్ మండలం రాజవరం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో జనగామ బీఆర్ఎస్ జిల్లా నాయకులు కేసిరెడ్డి రాకేష్ రెడ్డి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి, అధికారులతో మాట్లాడి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని సూచించారు. ధాన్యం తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్