ఎండల్లో కార్మికులకు మజ్జిగ పంపిణీ, సమస్యల పరిష్కారానికి హామీ

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలం రాజవరం గ్రామంలో ఎండల తీవ్రత దృష్ట్యా, వికసిత్ భారత్-రోజ్ గర్-2025 పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు (వెంకన్న) కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు కోట్ల అనిల్, ఎదుల సుదర్శన్, కార్యకర్తలు ఈర్ల కనకరాజు, ముక్కెర సంపత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్