ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో హైనా దాడులు పెరిగిపోతున్నాయి. వరుస ఘటనలతో రైతులు, పాడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంగళవారం దూడపై హైనా దాడి చేయగా, అది తాడు తెగి తల్లి వద్దకు చేరడంతో ప్రాణాలతో బయటపడింది. ఇప్పటికే ఒక దూడ మృతి చెందింది. అధికారులు వచ్చి పరిశీలిస్తున్నా శాశ్వత రక్షణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు.