ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాని హర్షిస్తూ జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నేతలు గురువారం సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి ఆరూరి శ్రీనివాస్ తమ నాయకులతో బాణసంచా పేల్చి సంబరాలు జరిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం ఎన్నో సంవత్సరాల ఆకాంక్ష అని వర్గీకరణతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ఎస్సీలకు న్యాయం జరుగుతుందన్నారు.