వరంగల్ లోని కాశీబుగ్గ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పులి ప్రియాంక అనీల్ శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రాత్రి 2 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు మార్కెట్లో నిరంతరం పర్యటించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను హెచ్చరించారు.