జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లులో దారుణం చోటుచేసుకుంది. ఇంటిలో నిద్రిస్తున్న వృద్ధురాలిపై కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు కౌన్సిలర్ చౌదరపల్లి సంపత్ రాజ్ అత్యాచారానికి ప్రయత్నించాడు. వృద్ధురాలు ప్రతిఘటించడంతో కౌన్సిలర్ బాత్రూంలోకి దూరాడు. స్థానికులు చుట్టుపక్కల వారిని పిలిచి 100కు డయల్ చేయడంతో పోలీసులు సంపత్ రాజ్ ను స్టేషన్ కు తరలించారు.