పేద కుటుంబానికి చెందిన తమకు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేరు వచ్చినప్పటికీ చివరి జాబితాలో తమ పేర్లను తొలగించారంటూ వృద్ధుడు కలెక్టర్ రిజ్వాన్ బాషాకు మొరపెట్టుకున్నాడు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్ కు వృద్ధుడు మాతంగి మల్లయ్య తన కుమారుడు చిట్టిబాబు, తన కూతురు బైరపాక ఉమలతకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా వారి పేర్లను చివరి జాబితా నుంచి తొలగించారన్నారు. విషయాన్ని అధికారులకు తెలిపి ఎం జరిగిందో తెలుసుకోవాలని సూచించారు.