మద్యం విక్రయిస్తున్న ఆరుగురి ఇండ్ల విద్యుత్ కనెక్షన్లు కట్

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని నష్కల్ గ్రామంలో మద్యపాన నిషేధం కోసం పంచాయతీ కఠిన చర్యలు చేపట్టింది. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురి ఇళ్లకు సర్పంచ్ శాతబోయిన రాజు విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని గ్రామసభలో తీసుకున్న నిర్ణయం మేరకే ఈ చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. నష్కల్ గ్రామాన్ని మద్యపాన రహితంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ముందడుగు వేశారని, ఎవరైనా మద్యం విక్రయిస్తే వారి రేషన్ కార్డులతో పాటు విద్యుత్, ఇతర ప్రభుత్వ సౌకర్యాలను కట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్