పొలం దారి వివాదం: మామపై అల్లుడి దాడి.. ముగ్గురి అరెస్ట్

పొలం దారి మూసివేసిన కక్షతో మామపై దాడి చేసిన అల్లుడు రాజుతో పాటు మరో ఇద్దరిని వేలేరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎర్రబెల్లికి చెందిన వీరేశం కూతురిని అల్లుడు రాజు కాపురానికి తీసుకెళ్లడం లేదని, దీంతో రాజు పొలానికి వెళ్లకుండా వీరేశం దారిని మూసివేశాడని సమాచారం. దీనిపై కక్ష పెంచుకున్న రాజు, జూన్ 9న తన అన్న శ్రీనివాస్, తల్లి వీరాబాయితో కలిసి మామపై తీవ్రంగా దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ జరిపిన ఎస్సై సురేశ్, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్