పుట్టలమ్మ కుంటలో రూ. 5 లక్షల చేపల మృత్యువాత

స్టేషన్ ఘన్పూర్ శివారులోని పుట్టలమ్మ కుంట చెరువులో సుమారు రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయని స్టేషన్ ఘనపూర్ మత్స్య సొసైటీ నాయకులు తెలిపారు. చెరువులో భారీగా పెరిగిన చేపలు కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు బరువున్నాయని, అయితే వందల సంఖ్యలో చేపలు నీటిపై తేలుతూ కనిపించాయని పేర్కొన్నారు. దీని వెనుక కుట్ర జరిగి ఉంటుందని, ఎవరైనా విషగుళికలు కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సుమారు రూ. 5 లక్షల నష్టం వాటిల్లినట్లు నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్