మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్

స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల పాలిట రేవంత్ రెడ్డి రాక్షసుడని ఆరోపించారు. గతంలో 10 వేల పంట నష్టపరిహారం ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. మొన్న వరంగల్ వచ్చి ఎకరాకు 10 వేల నష్టపరిహారం ఇస్తాననడం, గతంలో చెప్పిన మాటే మళ్ళీ చెప్పినట్లుగా ఉందని విడ్డూరంగా వ్యాఖ్యానించారు. రైతుల వద్దకు వెళ్లకుండా 100 పడకల ఆసుపత్రి వద్దకు వెళ్లాల్సిన ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్