వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ప్రాణాంతకమైన పారాక్వాట్ గడ్డి మందును వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఐఎంఏ కార్యాలయంలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ, ఈ మందు సైనైడ్ కంటే ప్రమాదకరమని, దీనివల్ల జరుగుతున్న మరణాలు, భూసారంపై దుష్ప్రభావాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిషన్ అధ్యక్షత వహించగా, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వైద్యులు హాజరయ్యారు.