రూ. 16లక్షల బంగారు ఆభరణాల బ్యాగు అప్పగింత

వేలేరు మండల కేంద్రానికి చెందిన గంజి రమేశ్ బాబు తన కుటుంబ సభ్యులతో లింగంపెళ్లి జాతరకు వెళ్తుండగా, వేలేరు వాటర్ ప్లాంట్ వద్ద రూ. 16 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగును పోగొట్టుకున్నారు. వేలేరు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి, ఆ బ్యాగును అక్కడే ఉన్న ఒక వ్యాపారి తీసుకున్నట్లు గుర్తించారు. అనంతరం, పోలీసులు ఆ వ్యాపారి నుండి బ్యాగును స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్