జనగామ జిల్లాలో భూమి రిజిస్ట్రేషన్ల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రైతుల నుంచి పూర్తి ఫీజు వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ మొత్తమే జమ చేసినట్లు దర్యాప్తులో తేలింది. తప్పుడు చలాన్లు, నకిలీ రసీదుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 8,55,577 నష్టం కలిగించారు. మొత్తం 10 డాక్యుమెంట్ల ద్వారా రూ. 8,68,884 వసూలు చేసి, రూ. 13,307 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారు. ఈ వ్యవహారంపై వరంగల్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.