జనగామ జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం వెంకటేశ్వరపల్లి శివారు పంట పొలాల వద్ద ప్రమాదవశాత్తు ఓ యువకుడు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అటుగా వెళుతున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన వాహనాన్ని ఆపి యువకుడి వద్దకు వెళ్లాడు. ప్రథమ చికిత్స చేసి సీపీఆర్ చేయగా యువకుడు స్పందించలేదు. అప్పటికే మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు.